శ్రీ గణనాథ చిత్తమున్ స్థిరత నిల్పి
పద్యముల రాయ బూనితిన్ పరమ ప్రేమ
నవరసమ్ములు రచనలో నాట్యమాడి
బుధ జనంబుల మెప్పును పొందనిమ్ము(1)
శారదా దేవి పద సారసాబ్జములకు
పరిమళమ్మిడు పద్యాల విరుల సరుల
భక్తి నర్పించగా కృతి శక్తి కొలది
రచన సేయగ బూనితి రాజితముగ(2)
రామా రఘువంశార్ణవ
సోమా సుర నర ముని నుత శుభగుణ ధామా
మామన్మందిరమున నిలు
మో మాధవ సుప్రకాశ ముదమును గూర్పన్
(3)
భరత దేశంబు సుశ్లోక భాగ్యసీమ
నత సదాచార సంపన్న నుత సుశీల
ఆయురారోగ్య సంవర్ధితాంతరంగ
నిత్యసంతోష భరితయౌ నిర్మలాంగి (4)
సంప్రదాయములను పేర సలుపునట్టి
నాటి యాచార వ్యవహార కోటులందు
గొప్ప విజ్ఞాన శాస్త్రంబు గోప్యముగను
దాగియున్నది చూడగా ధన్యమగును(5)
నాడు నేడు దాల్చు బోటుల గాజులు
అధిక రక్త పోటునదుపునుంచు
చేతి నరము దాకి చేతనగలిగించు
ననెడి మాట సత్య మనునరాశ (6)
రోగనిరోధక శక్తిని
వేగముగా పెంచునాక్యు ప్రెషరను రీతిన్
పోగులకై చెవికుట్టుట
భాగమె నారోగ్యమందు భాగ్యమరాశా (7)
మెరుగగు జ్ఞాపక శక్తియు
చురుకుగ పనిచేయు మెదడు
సూనృతమిదియే
కరములు రెంటిని కలుపుచు
వర వందనమును సల్పిన వరమె యరాశా (8)
ఫాలమందున కుంకుమన్ బరగ దాల్చ
నచటి నరములు నుత్తేజ ప్రచలితమయి
మానసిక శాంతి యవధాన మానసమును
గూర్చు;యొత్తిడిన్ మాన్పెడి గుణమరాశ( 9
కాలు సేతుల వేళ్ళకు కలగనూరి
నట్టి గోరింట పత్రమున్ పెట్టి చూడు
తనువునకు నిచ్చు కడు చల్లదనము ; హాయి
నొనరజేయును ;యొత్తిడి కనగ రాదు; (10)
రాగి లోహము నీటిని వేగిరముగ
శుద్ధిజేయున నార్యోక్తి సూనృతంబు
కాన రాగి కాసుల నది లోన వేయు
భక్తి ప్రభవించె చరితకే బలమరాశ(11)
గుండెకు గర్భాశయముకు
నిండుగ రక్తమును నడుపు నియతిగ నెపుడున్
వెండియు శుభములనిడునట
దండిగ మెట్టెలు తరుణులు దాల్పనరాశా12
ఆమ్లజని నిచ్చు వృక్షములహ్నమందు
రాగి చెట్టీయగలదట రాత్రిపూట
గాన నశ్వద్ధమే పూజ గలిగి యుండు
గుడుల ముందుండి యారోగ్యమిడునరాశ
(13)
వలయు విశ్రాంతి జీర్ణ వ్యవస్థకిడును
వెడలు విష పదార్థములిక యొడలునుండి
దీర్ఘకాలిక వ్యాధులందేది సోక
కుండ రక్షించు నుపవాస ముండువేళ (14)
కరమునకు నుప్పునిడు నధికారమునను
మందలించిన మనసంత కుందునంత
కలహములు రేగు; నుప్పును కరము కిడగ
వలదు వలదంచు నుడివిన పథమరాశ 15
ఇంట వాకిట నూడ్వగా మింటికెగిసి
సుడులు దిరుగును గాలిలో సూక్ష్మ క్రిములు
గోమయంబునలికెడి నేమమనగ
క్రిముల నాశనమొనరించు కిటుకరాశ (16)
ఇంటిముంగిట ముగ్గులు కంటికింపు
యింపుయే గాక వరిపిండి నింపు కడుపు
చీమలకు పక్షి తతులకు ప్రేమతోడ
ముగ్గు జీవకారుణ్య సమ్ముదమరాశ (17)
ధ్వనులు మానవ తనువుపై మనసుపైన
కడు ప్రభావంబు చూపుట కద్దుగాదె
వేదమంత్రాల సుస్వర నాదమహిమ
మనసునకు శాంతి గూర్చుటే ఘనమరాశ 18
పచ్చకప్పురంబు పచ్చని తులిసియు
రాగి పాత్రనీట రాజితముగ
దేవళంబుదివ్య తీర్థమై లభియించి
రోగములను పారద్రోలరాశ 19
అమృత తుల్యమౌ వాయువు లలరునంత
బుద్ధి వికసించునాయువు వృద్ధియగును
మనసుకేకాగ్రతయునబ్బు కనుక సూర్యు
డుదయమొందక పూర్వమే నిదురవీడు 20
సందెవేళన యింటిని చక్కబరచ
చీపురును బట్టి యూడ్చుట పాపమనిరి
విలువ గలిగిన వస్తువుల్ తలుపుదాటి
చనునటంచని నుడివిరి గనుమరాశా 21
నిరతము మడిమను దాకును
ధరియించిన కాళ్ళ పట్టి తరుణెముకలకున్
వరమగు బలమును నిడునా
స్వరముయు నిడు దైవ శక్తి సత్యమరాశా
22
ద్వారమున మామిడాకుల తోరణాలు
వేడుకల చిహ్నములె గాదు వివరమీయ
గా నమితమామ్లజని నిడు కల్పతరువు
శీఘ్రముగ వాడనిది మావి చెట్టరాశ 23
మంచి ఆమ్లజని నిడును మించి ఓష
ధిగనుతులు గొన్నయది చెంత తిరుగ చాలు
మిగుల యారోగ్య మిడి బ్రోచు మేడ గుడిసె
యనకయు తులసి యుండుట ఘనమరాశ 24
రాత్రివేళలో సురాధినాథునకైన
చెట్టుకింద నిదుర చేటు గూర్చు
బొగ్గు పులుసు వాయువొద్దికగా వీచి
వ్యాధులను వ్యాప్తి జేయును వలదరాశ 25
ఉంగరమువేలికిని గుండె కున్నబంధ
మింత యనిచెప్ప నేరము వింతగాదు
నిశ్చితార్థపుటుంగరం నియమముగను
వేలికిడ గుండెకు తెలియు వినుమరాశ 26
పూజసేయువేళ భోజన వేళలో
భూమి మీద పీఠమేమి లేక
వేడ్కకూర్చొనినను విద్యుదయస్కాంత
శక్తి వలన కూలు సత్తువంత 27
కొండపై దైవ మందిరాలుండు గనక
చని ప్రదక్షిణ మొనరించి సాగిలబడు
భక్తతతులకు తక్షణ శక్తి నిడగ
నుప్పు పులుపుల పులిహోర నొసగఫలము
28
దేవళము గంట మ్రోగించ దేహమందు
సప్త చక్రముల్ మేల్కొని దీప్తిజెందు
పొందునేకాగ్రత మెదడునొందు శాంతి
భక్తి పేర ప్రశాంతత ఫలమరాశ 29
గుడుల జనములు కదలాడు గడియలోన
రోగ క్రిములెన్నో యందించు రుగ్మతలను
కప్పురంబును వెలిగించ క్షణములోన
క్రిములు నశియించు శాంతి నీకిడు నరాశ 30
పసుపురాసి శోభ పొసగగ ముగ్గేయ
గడపకందమబ్బు ఘనత గాక
నింటి బయటి క్రిముల నింటిలోకడుగిడ
నీయకుండ సేయు నిక్కముగను 31
కఫము తొలగించు పైత్యమున్ కాలరాచు
బలము గలిగించు తనువుకు చలువనొసగు
పెరుగు మిరియాలు నల్లము తురుము కొత్తి
మీర గలుగు దద్దోజనమే యరాశ 32
మేనిలోనున్న యినుమంత మెదడుజేరి
రక్తపోటును తలనొప్పి రగులజేయు
శిరసునుత్తర దిశనుంచి గురకబెట్ట
తగదయస్కాంత క్షేత్రపుతగువరాశ 33
వస్తు వ్యాపార సంస్థల వాహనముల
ముందు నిమ్మ మిరపకాయ పొందుపరచ
దృష్టి పరిహారమే గాక సృష్టి లోని
క్రిముల దరిజేరనీయని క్రమమరాశ 34
నీటిలో పని జేసెడి నెలతల పద
ములు పగుళ్ళిడు సహజము మలినమైన
బట్టలుతికిన నీళ్ళతో పదము గడుగ
రోగకారక క్రిములంటు రుజువరాశ 35
మాటలాడవలదు మౌనమే మేలగు
కూడు గుడుచు వేళ కోరిపలుక
లక్షణముగనూరు లాలా జలంబింక
నూరకను నజీర్తి నొందరాశ 36
నిదుర మేల్కొన కనులందు నిలిచినట్టి
గొప్ప విద్యుత్తు ప్రసరించు తప్పకుండ
తొలుత హస్తమున్ గాంచుట ఫలితమిచ్చు
గాన నుదయానకరముల గనుమరాశ 37
మనసులోనున్న భావనే కనుల నుండి
కిరణ ప్రసరణ మయి దృష్టి వరలుచుండు
దృష్టిదోషము కలిగించు కష్టములను
దోషపరిహారమున్జేయ తొలుగరాశ 38
ఉత్తర ధృవమాకర్షణోత్సుకంబు
దక్షిణంబు వికర్షణ లక్షణంబు
గాన ప్రాగ్దిశాభి ముఖము ధ్యానమిడును
ప్రాణశక్తిని నొసగు ప్రభాకరుండు 39
గంజినద్ది నేయు రంజిల్లు వస్త్రాలు
క్రిముల నిలయ మగును
విమల పసుపు
రాసి దాల్ప రోగ రాశిని మడయించు
పసుపు కుంకుమద్దు ఫలమరాశ 40
కఫము హరియించు బలమును కలుగజేయు
తనువు శూలల మాన్పును దంత కాంతి
నిడును మేనికాంతిని పెంచు కడుపు లోని
పుళ్ళ మాన్పును యరిటాకు భోజనంబు 41
రాగి మామిడి మోదుగ రగులజేసి
ఆవునేతిని హోమమునాహుతిచ్చి
ఘన సువాసన ద్రవ్యముల్ కాల్చినట్టి
హోమ ధూమము యారోగ్యమోముచుండు
42
బల్లి మలమూత్రములు మేని పైన బడిన
బొబ్బలెక్కునది విషపు పురుగు గాన
బల్లి పాటుకు స్నానంబు పరమశుభము
కలిమి యారోగ్యదాయక ఫలమరాశ 43
గోళ్ళు కొరుక దరిద్రము గోటి సందు
గలుగు మలినాలు నోటికి కడుపులోకి
జారి జబ్బుల కలిగించు చేరి వైద్యు
ని గన మిగుల ధనము ఖర్చు నిజమరాశ 44
పాదరక్షలు చేతితో పట్టగూడ
దనుచు నుడువుట సత్యమే గనగ నిజము
సాగువేళననంటును రోగక్రిములు
చేతబట్టనారోగ్యపు చేటరాశ 45
చంద్ర కిరణ ప్రభావిత సంద్రమందు
నోషధీ గుణములు మెండు నుండు కార్తి
కంబునను పౌర్ణమీ తిథి కడలి స్నాన
మాచరించిన ఫలమిడు మహినరాశ 46
చర్మ రక్షణ కలిగించు చలిన చేత
నత్వమును రగిలించును సత్వమిడును
ఉదర సంబంధ వ్యాధుల వదలగొట్టు
నంబుధి స్నాన సత్ఫలితంబరాశ 47
రక్త ప్రసరణ మెరుగు పరచును మేని
కాంతి వృద్ధి బొందు మనసు శాంతినొందు
చేయు చన్నీటి స్నానంబు చేవబెంచు
కేశరక్షణ గావించు కిటుకరాశ 48
కులము మతము ప్రాంత కలతలు విడనాడి
ఒక్కచోటజేరి ఒద్దికగను
భోజనంబుసేయ భు"వనభోజన" మాయె
కలిసి బ్రతుక శుభము గలుగరాశ 49
ఉసిరి చెట్టు కింద నోగిరంబు గొనగ
మనసు తనివిచెందు వనము నడుమ
నాకులందు తినగనారోగ్యమున్ బెంచు
స్వచ్చమైన గాలివరమరాశ 50
తలన శఠగోపమును నుంచ తనువులోని
విద్యుదావేశమంతయు వెలువరించి
మది ప్రశాంతత నొందగ మహిమజూపు
లోహ స్పర్శయే కోవెలలోనరాశ 51
భక్తి తోడుత గుంజీలు పార్వతీ త
నయుని ముందు దీసెడి వేళ నరయ మేని
రక్త ప్రసరణ మెదడుకు రయముజేరి
బుద్ధి వికసించు చుండును పుడమరాశ 52
జీలకర బెల్లము వివాహ కాల మందు
వధువు వరుల శిరస్సున వరుస దాల్ప
గన పరస్పరాకర్షణ కలుగ జేయు
మెదడు చైతన్య మొందెడి విధమరాశ 53
మనసు మాటల నొకటిగా మనగ చేయు
ప్రాణ శక్తిని పంపగా బాట యగును
పాదముల స్పర్శ ప్రేమకామోదమగును
కాలు తొక్కించుడందుకే గదయరాశ 54
మల్లె పూవుల వాసన మమతబెంచు
తనువు కుదురుగా నుంచును తపన గూర్చు
వాతదోషమున్ బాపును వపువు రక్త
శుద్ధి జేయును సంతాన వృద్ధరాశ 55
గొడుగు గృహమందు తెరిచిన కుదురులేక
చుట్టుపక్కల వస్తువుల్ పట్టు డబ్బు మనుజులకు కూడగాయమై చనును గాన
తెరువబోకని దెల్పు తెరువరాశ 56
అద్దమతి ఖరీదైనది యందులోను సులభముగ లభ్యమవనిది శోభ గూర్చు
పగిలి పోయిన గ్రుచ్చును ప్రజల కనగ
పగలరాదింట నద్దమన్ పలుకరాశ 57
కటిక చీకటిన్ నఖముల కత్తిరించ
చిగురు సహితము తెగునని తగని గాయ
మగునని తలచి రవి యస్తమయము పిదప
గోళ్ళుతీయుట తగదను గుర్తరాశ 58
గతిన గ్రహణ కాల మతి నీల లోహిత కిరణములును దాకి కీడు గలుగు
నంచుగర్భిణులను కించిత్తు గదలరా
దనిరి పెద్దలెపుడు గనుమరాశ 59
ఏకవింశతి పత్రాల నేకదంతు
పూజ సల్పగ నారోగ్యపూర్ణమిడును
శ్వాస చర్మపు వ్యాధుల సంహరించు
నాకులాయుస్సునందించు ననుటరాశ 60
కారమున్ ముందు గొనుటను కారణమున
నోట లాలాజలంబుల నూట యుండు
జీర్ణ శక్తియు మెరుగగు చేరు తీపి
ముందుగా గొననజీర్ణమొందరాశ 61
తుమ్ముటన్ గననారోగ్య దోషమనుచు
కొంత తడవు నిల్చియు నీరు గొనగ నిచ్చి
దీర్ఘమాయురారోగ్యముల్ దీవెనొసగి
సాగిపోవుట నాచార స్వరమరాశ 62
వక్షమందున వేలాడి లక్షణముగ
నల్లపూసలు నిడునట చల్లదనము
నలుపు దృష్టిదోష నివారణమ్ము గాన
దాల్ప శుభమగు నరయగ ధరనరాశ 63
పంచ పల్లవములు పరిమళ ద్రవ్యాలు
నారికేళ ఫలము చేరియుండు
పసిడి రాగి నీట పావనత్వము గూర్చు
కలశ జలమన నారోగ్యకరమరాశ 64
దేవళంబు జేరి దీక్ష ప్రదక్షిణ
చేసి మూర్తి గాంచి చేతులొగ్గి
తడవు కొంత నిల్వ ధ్యానంబు చేకూరా
మానసిక ప్రశాంతి మనునరాశ 65
ఇంటిముందు వేప కంటికింపేగాదు
దట్టమైన నీడ తప్పకిడును
గాలి యాకు పుల్ల కలిగించు నారోగ్య
జీవనంబు నిడును స్థిరమరాశ 66
దేవదేవుని చరణాల దివ్య భక్తి
సలుపు సాష్టాంగ వందనము లలనలకు
పాడిగాదని నుడివె గర్భాశయమ్ము
నేలకంటగ రాదను నెపమరాశ 67
శ్వాస కోశ వ్యాధి సాగనంపు గుణము
జీర్ణశక్తి బెంచు పూర్ణ గుణము
ముసలి తనపు చాయ వెస జేరనీయని
తమలపాకు యమృత సమమరాశ 68
నవయుగాదిన పచ్చడి నరయ తీపి
పులుపు నుప్పుయు కారము మెలగు వగరు
చేదు కలయిక రోగ ననిరోధకముగ
ఆయురారోగ్యమిడు పర్వమోనరాశ 69
ఇంటికి సున్నంబిడుటయు
కంటికి నవకాంతి శాంతి కారకమగు నే
తంటలు గానని మది సుఖ
మంటగ తెలతెల్ల దనపుమహిమనరాశ 70
పొద్దు పొడవ చూపుడువేలు బొటన వేలు
నొకటి గా జేసి ముగ్గులనుంచు మగువ
జ్ఞాన ముద్రను దాల్చిన మౌని వలెను
మానసిక శాంతి బొందుట ఘనమరాశ 71
నిదురబోవు నపుడు నొదుగగ కుడివైపు
ఆమ్లమెగిసి గుండె నంటు గాన
ఎడమ వైపు దిరిగి పడుకున్న మేలగు
ననెడు సూక్తి కలను గనుమరాశ 72
మెదడు లేలేత నరముల కుదురుకొనక
చిన్న పిల్లలు తరువుల చివురులనగ
తలలపైగొట్ట తగదని ధర్మమొదవె
సతతమాచారమై భువి చనునరాశ 73
మంచి గంధము చలువను పంచుచుండు
మధుర కంఠమునొనరగా మందుయగును
గాన కలకంఠులకు నలంకారముగను
గంధమును బూయు చందమున్ గనునరాశ 74
ఆహారము గొనినంతనె
ఆ హా! నిదురావహించునట జీర్ణముకై
సాహాయము నిడ రుధిర ప్ర
వాహము యటజేర మత్తు వపునకు జేరున్
75
గోరు వెచ్చని నీటిని కోరి కోరి
వేకువన గ్రోల మలినాలు వీడి చనును
మేని యంగముల్ చైతన్య మూని నంత
నూతనోత్సాహమబ్బగా నోమరాశ 76
పాలు కాఫీలు తేనీరు పరులకిడగ
నోటితో నూది చల్లార్చ మేటి తప్పు
బొగ్గు పులుసు వాయువు చెడి పోవునట్లు
జేయు నోటి క్రిములచట చేరరాశ 77
వేసవిన్ రామనవమియే వేడుకవగ
భక్తి గుఢపాన సేవనాసక్తి బెంచు
విష్ణు కిడు వడపప్పు నైవేద్యమరయ
చల్లదనమును గలిగించు జవమరాశ 78
గాలి శీతలమొందగా కాయమందు
నూష్ణమధికము ఖర్చగు నుదయమందు
పులగ దధ్యోదనంబులు పొట్టకిడగ
రక్ష ధనుర్మాసదీక్షనలరు నరాశ 79
ముంగిటన్ రంగ వల్లులు ముదము గూర్ప
నావు పేడతో గొబ్బెమ్మ నలరజేయ
రోగ క్రిమికీటకాదుల రోయువేళ
మకర సంక్రాంతికాహ్వానమౌనరాశ 80
ఉసిరి పేదల సంజీవినోషధిగను
తులసి యౌషధ రారాజ తుల్యముగను
నిండు కార్తీక పౌర్ణమి పండుగందు
కలిపి కళ్యాణమొనరించు ఫలమరాశ 81
నతము ప్రవహించు నదులందు స్నానమాడ
ఓషధీ గుణములు మేనినుండ గలవు
తనువులో బుట్టు విద్యుత్తు తరలజేయు
నిలన కార్తీక మాసమే నిజమరాశ 82
వానకాలమజీర్ణమే వరలుచుండు
తినెడి యాహార దోషముల్ తీవ్రమగును
నాల్గునెలలేక భుక్తమున్ నమ్ముకున్న
సతతమారోగ్యమొసగు జీవితమరాశ 83
పసిడి నగలను దాల్చిన పరమ శుభము
చర్మరోగాల బాపి సత్సంతతిడును
తనువునుత్పన్న మగు వేడి తరలజేసి
చల్లదనమును కాపాడు జవమరాశ 84
నడుము లావెక్కకుండగా నణచునెపుడు
చురుకుదనమును పోషించు చొక్కముగను
నడుము వడ్డాణమున్ దాల్చ నమిత ఫలము
లోహ స్పర్ష శుభము మేని లోనరాశ 85
మేని చెమటన పగడము మేళవించి
పడతి సంతాన ప్రాప్తికై బలమునిడును
పగడమందానికే గాదు పలు విధముల
నాయురారోగ్యమిడు రత్నమేయరాశ 86
భూమిదానమీయ పూర్ణత్వ మబ్బదు
ధనమునీయ మిగుల తనివిగాదు
పసిడినీయ బూన బహుళంబు కాంక్షించు
తనివి దీర్చు నన్న దాన మొకటె 87
పులుపజీర్ణము గావించు కలిగినంత
పగటి వేళన భుజియించ పాడియగును
పెరుగు రాత్రిన తినగను పిలుచు రోగ
ములను తెలసి మసలుకొన ఫలమరాశ 88
నవరసాలను చిలికించి కవితలల్లి
కావ్యముల నల్లినారు సుకవినృపతులు
భావనామార్గ దర్శులై చేవ గలుగు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(89)
రామకథ మహా భారత రమ్యగాధ
భాగవతమును వెలయించి భక్తి నిల్పె
సంస్కృతీ సంప్రదాయాల చాటగలుగు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(90)
తాంతియా తోపె రాణా ప్రతాప సింహ
ఝాన్సి లక్ష్మి శివాజియు చాందుబీబి
కట్ట బ్రహ్మన యల్లూరి గాంధి నెహ్రు
భగతు సింగుల గన్నట్టి భరత మాత {91}
స్వార్థమింతైన యెరుగక సమరమందు
ప్రాణముల ఫణముగ నెట్టి క్షోణి గలిసి
మాతృ భూమికి స్వాతంత్ర్య ఫలములిడిన
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(92)
ఆది శంకరుల్ రామానుజాది సద్గు
రువులు రామకృష్ణులు వివేకుడు జగతిన
పర్యటించిరి బోధనల్ పరిమళించు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(93)
మత విభేదము లెరుగని మానవతను
ప్రాంతభేదము తెలియని భావుకతను
పెక్కుభాషల చవిగొన్న మక్కువ గల
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(94)
సరస సంగీత సాహిత్య సత్కళలను
చిత్రలేఖన శిల్ప వైచిత్రములను
వివిధ నాట్యపుకళలీను వేడ్కగలుగు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(95)
తోటి సోదర క్షేమమే మేటిగాగ
దేశ సంరక్షణోద్యోగ దీప్తి వెలుగ
ఎండ చలి వానకోర్చెడి మెండు ధీర
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
{96}
ప్రాణమను మాట నే తృణ ప్రాయమనుచు
జన్మ హేతువే రక్షణాచారమనుచు
సైనికుండయి సరిహద్దు పూని నిలుచు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(97)
మంచియు విశ్వాసముయు ప్ర
పంచము కలిగుండ గోరు మానసముండన్
యెంచియు నీ నడవడికన
పెంచుము ఆ రెంటి మిగుల మేలగు సుమ్మీ
(98)
తల్లిదండ్రుల దీవెనల్ వెల్లి విరియ
గురువు చూపిన మార్గమే గురుతు గాగ
హితుల సలహాలు వెన్నంటి హితము గూర్చ
సేయు కార్యము విజయమై చెంత నిలదె
(99)
భానుడుదయించి ఎదుగుచు భాసమొందు
మొలక పుట్టుచు చెట్టుయై ముదమునిచ్చు
రోజు రోజుకు నభివృద్ధి రూఢిగాక
జన్మమేటికి తృటిలోన చావుమేలు
(100)
మంచి శ్రోతకాగలడిల మంచివక్త
పాఠకోత్తముడే కవి పీఠమెక్కు
కొంతనేర్చిన యగునది కొండ సమము
అంకురము లేని వృక్షమున్నరయగలమె
(101)
ఓటమెరుగని గెలుపు పోరాటమందు
చిత్తశుద్ధిగ లక్ష్యమున్ చేరువరకు
అలసటెరుగని శ్రమ సేయుమహర్నిశలు
విశ్వమంతకు నినుజూపు విజయమొకటె
(102)
గతమునందున చేసిన ఘనుల పనులు
తిరిగి నీవాచరింపగ నొరుగునేమి
మూస పనులకు విలువలేముండవయ్య
కొత్తదనమును మనసార కోరు జగము
(103)
తారలంటెడి లక్ష్యమున్ చేరనెంచ
కుసుమమైనను పొందమా కువలయాన
లక్ష్యమందలి ఘనతయే సాక్ష్యమగును
ఉన్నతాలోచనలె జగతికూపిరగును
(104)
చేతకానిది లేదు నీ చేవముందు
ఓటమన్నదిలేదు పోరాటమందు
చిన్ని చేపల మొప్పకే శిరము వంచు
ప్రళయ సంద్రపు అలజడి ప్రకృతి లోన(105
స్వార్థ జీవికి గలిగెడి సౌఖ్యమేమి
బంథుమిత్రుల నొనగూరు బలమదేమి
పరులకుపకారమొనరించు ప్రతినలోన
వనధి లంఘించు శక్తియే వరముగాదె
(106)
ధనము సంపాదనముసేయ ధరణిలోన
బతుకు సాంతమునంతమై చితికిపోవు
జీవనము సఫలతమొందజేయు కార్య
మొక్కటైనను సలుపక ముక్తి లేదు (107)
భారతీయత నడుగడుగు ప్రస్తుతించి
సంస్కృతీ సంప్రదాయాలు సంస్మరించి
శాస్త్ర విజ్ఞాన ప్రాభవం సాగనెంచి
రచన సలిపితి పద్య తోరణముగాగ (108)
పద్యముల రాయ బూనితిన్ పరమ ప్రేమ
నవరసమ్ములు రచనలో నాట్యమాడి
బుధ జనంబుల మెప్పును పొందనిమ్ము(1)
శారదా దేవి పద సారసాబ్జములకు
పరిమళమ్మిడు పద్యాల విరుల సరుల
భక్తి నర్పించగా కృతి శక్తి కొలది
రచన సేయగ బూనితి రాజితముగ(2)
రామా రఘువంశార్ణవ
సోమా సుర నర ముని నుత శుభగుణ ధామా
మామన్మందిరమున నిలు
మో మాధవ సుప్రకాశ ముదమును గూర్పన్
(3)
భరత దేశంబు సుశ్లోక భాగ్యసీమ
నత సదాచార సంపన్న నుత సుశీల
ఆయురారోగ్య సంవర్ధితాంతరంగ
నిత్యసంతోష భరితయౌ నిర్మలాంగి (4)
సంప్రదాయములను పేర సలుపునట్టి
నాటి యాచార వ్యవహార కోటులందు
గొప్ప విజ్ఞాన శాస్త్రంబు గోప్యముగను
దాగియున్నది చూడగా ధన్యమగును(5)
నాడు నేడు దాల్చు బోటుల గాజులు
అధిక రక్త పోటునదుపునుంచు
చేతి నరము దాకి చేతనగలిగించు
ననెడి మాట సత్య మనునరాశ (6)
రోగనిరోధక శక్తిని
వేగముగా పెంచునాక్యు ప్రెషరను రీతిన్
పోగులకై చెవికుట్టుట
భాగమె నారోగ్యమందు భాగ్యమరాశా (7)
మెరుగగు జ్ఞాపక శక్తియు
చురుకుగ పనిచేయు మెదడు
సూనృతమిదియే
కరములు రెంటిని కలుపుచు
వర వందనమును సల్పిన వరమె యరాశా (8)
ఫాలమందున కుంకుమన్ బరగ దాల్చ
నచటి నరములు నుత్తేజ ప్రచలితమయి
మానసిక శాంతి యవధాన మానసమును
గూర్చు;యొత్తిడిన్ మాన్పెడి గుణమరాశ( 9
కాలు సేతుల వేళ్ళకు కలగనూరి
నట్టి గోరింట పత్రమున్ పెట్టి చూడు
తనువునకు నిచ్చు కడు చల్లదనము ; హాయి
నొనరజేయును ;యొత్తిడి కనగ రాదు; (10)
రాగి లోహము నీటిని వేగిరముగ
శుద్ధిజేయున నార్యోక్తి సూనృతంబు
కాన రాగి కాసుల నది లోన వేయు
భక్తి ప్రభవించె చరితకే బలమరాశ(11)
గుండెకు గర్భాశయముకు
నిండుగ రక్తమును నడుపు నియతిగ నెపుడున్
వెండియు శుభములనిడునట
దండిగ మెట్టెలు తరుణులు దాల్పనరాశా12
ఆమ్లజని నిచ్చు వృక్షములహ్నమందు
రాగి చెట్టీయగలదట రాత్రిపూట
గాన నశ్వద్ధమే పూజ గలిగి యుండు
గుడుల ముందుండి యారోగ్యమిడునరాశ
(13)
వలయు విశ్రాంతి జీర్ణ వ్యవస్థకిడును
వెడలు విష పదార్థములిక యొడలునుండి
దీర్ఘకాలిక వ్యాధులందేది సోక
కుండ రక్షించు నుపవాస ముండువేళ (14)
కరమునకు నుప్పునిడు నధికారమునను
మందలించిన మనసంత కుందునంత
కలహములు రేగు; నుప్పును కరము కిడగ
వలదు వలదంచు నుడివిన పథమరాశ 15
ఇంట వాకిట నూడ్వగా మింటికెగిసి
సుడులు దిరుగును గాలిలో సూక్ష్మ క్రిములు
గోమయంబునలికెడి నేమమనగ
క్రిముల నాశనమొనరించు కిటుకరాశ (16)
ఇంటిముంగిట ముగ్గులు కంటికింపు
యింపుయే గాక వరిపిండి నింపు కడుపు
చీమలకు పక్షి తతులకు ప్రేమతోడ
ముగ్గు జీవకారుణ్య సమ్ముదమరాశ (17)
ధ్వనులు మానవ తనువుపై మనసుపైన
కడు ప్రభావంబు చూపుట కద్దుగాదె
వేదమంత్రాల సుస్వర నాదమహిమ
మనసునకు శాంతి గూర్చుటే ఘనమరాశ 18
పచ్చకప్పురంబు పచ్చని తులిసియు
రాగి పాత్రనీట రాజితముగ
దేవళంబుదివ్య తీర్థమై లభియించి
రోగములను పారద్రోలరాశ 19
అమృత తుల్యమౌ వాయువు లలరునంత
బుద్ధి వికసించునాయువు వృద్ధియగును
మనసుకేకాగ్రతయునబ్బు కనుక సూర్యు
డుదయమొందక పూర్వమే నిదురవీడు 20
సందెవేళన యింటిని చక్కబరచ
చీపురును బట్టి యూడ్చుట పాపమనిరి
విలువ గలిగిన వస్తువుల్ తలుపుదాటి
చనునటంచని నుడివిరి గనుమరాశా 21
నిరతము మడిమను దాకును
ధరియించిన కాళ్ళ పట్టి తరుణెముకలకున్
వరమగు బలమును నిడునా
స్వరముయు నిడు దైవ శక్తి సత్యమరాశా
22
ద్వారమున మామిడాకుల తోరణాలు
వేడుకల చిహ్నములె గాదు వివరమీయ
గా నమితమామ్లజని నిడు కల్పతరువు
శీఘ్రముగ వాడనిది మావి చెట్టరాశ 23
మంచి ఆమ్లజని నిడును మించి ఓష
ధిగనుతులు గొన్నయది చెంత తిరుగ చాలు
మిగుల యారోగ్య మిడి బ్రోచు మేడ గుడిసె
యనకయు తులసి యుండుట ఘనమరాశ 24
రాత్రివేళలో సురాధినాథునకైన
చెట్టుకింద నిదుర చేటు గూర్చు
బొగ్గు పులుసు వాయువొద్దికగా వీచి
వ్యాధులను వ్యాప్తి జేయును వలదరాశ 25
ఉంగరమువేలికిని గుండె కున్నబంధ
మింత యనిచెప్ప నేరము వింతగాదు
నిశ్చితార్థపుటుంగరం నియమముగను
వేలికిడ గుండెకు తెలియు వినుమరాశ 26
పూజసేయువేళ భోజన వేళలో
భూమి మీద పీఠమేమి లేక
వేడ్కకూర్చొనినను విద్యుదయస్కాంత
శక్తి వలన కూలు సత్తువంత 27
కొండపై దైవ మందిరాలుండు గనక
చని ప్రదక్షిణ మొనరించి సాగిలబడు
భక్తతతులకు తక్షణ శక్తి నిడగ
నుప్పు పులుపుల పులిహోర నొసగఫలము
28
దేవళము గంట మ్రోగించ దేహమందు
సప్త చక్రముల్ మేల్కొని దీప్తిజెందు
పొందునేకాగ్రత మెదడునొందు శాంతి
భక్తి పేర ప్రశాంతత ఫలమరాశ 29
గుడుల జనములు కదలాడు గడియలోన
రోగ క్రిములెన్నో యందించు రుగ్మతలను
కప్పురంబును వెలిగించ క్షణములోన
క్రిములు నశియించు శాంతి నీకిడు నరాశ 30
పసుపురాసి శోభ పొసగగ ముగ్గేయ
గడపకందమబ్బు ఘనత గాక
నింటి బయటి క్రిముల నింటిలోకడుగిడ
నీయకుండ సేయు నిక్కముగను 31
కఫము తొలగించు పైత్యమున్ కాలరాచు
బలము గలిగించు తనువుకు చలువనొసగు
పెరుగు మిరియాలు నల్లము తురుము కొత్తి
మీర గలుగు దద్దోజనమే యరాశ 32
మేనిలోనున్న యినుమంత మెదడుజేరి
రక్తపోటును తలనొప్పి రగులజేయు
శిరసునుత్తర దిశనుంచి గురకబెట్ట
తగదయస్కాంత క్షేత్రపుతగువరాశ 33
వస్తు వ్యాపార సంస్థల వాహనముల
ముందు నిమ్మ మిరపకాయ పొందుపరచ
దృష్టి పరిహారమే గాక సృష్టి లోని
క్రిముల దరిజేరనీయని క్రమమరాశ 34
నీటిలో పని జేసెడి నెలతల పద
ములు పగుళ్ళిడు సహజము మలినమైన
బట్టలుతికిన నీళ్ళతో పదము గడుగ
రోగకారక క్రిములంటు రుజువరాశ 35
మాటలాడవలదు మౌనమే మేలగు
కూడు గుడుచు వేళ కోరిపలుక
లక్షణముగనూరు లాలా జలంబింక
నూరకను నజీర్తి నొందరాశ 36
నిదుర మేల్కొన కనులందు నిలిచినట్టి
గొప్ప విద్యుత్తు ప్రసరించు తప్పకుండ
తొలుత హస్తమున్ గాంచుట ఫలితమిచ్చు
గాన నుదయానకరముల గనుమరాశ 37
మనసులోనున్న భావనే కనుల నుండి
కిరణ ప్రసరణ మయి దృష్టి వరలుచుండు
దృష్టిదోషము కలిగించు కష్టములను
దోషపరిహారమున్జేయ తొలుగరాశ 38
ఉత్తర ధృవమాకర్షణోత్సుకంబు
దక్షిణంబు వికర్షణ లక్షణంబు
గాన ప్రాగ్దిశాభి ముఖము ధ్యానమిడును
ప్రాణశక్తిని నొసగు ప్రభాకరుండు 39
గంజినద్ది నేయు రంజిల్లు వస్త్రాలు
క్రిముల నిలయ మగును
విమల పసుపు
రాసి దాల్ప రోగ రాశిని మడయించు
పసుపు కుంకుమద్దు ఫలమరాశ 40
కఫము హరియించు బలమును కలుగజేయు
తనువు శూలల మాన్పును దంత కాంతి
నిడును మేనికాంతిని పెంచు కడుపు లోని
పుళ్ళ మాన్పును యరిటాకు భోజనంబు 41
రాగి మామిడి మోదుగ రగులజేసి
ఆవునేతిని హోమమునాహుతిచ్చి
ఘన సువాసన ద్రవ్యముల్ కాల్చినట్టి
హోమ ధూమము యారోగ్యమోముచుండు
42
బల్లి మలమూత్రములు మేని పైన బడిన
బొబ్బలెక్కునది విషపు పురుగు గాన
బల్లి పాటుకు స్నానంబు పరమశుభము
కలిమి యారోగ్యదాయక ఫలమరాశ 43
గోళ్ళు కొరుక దరిద్రము గోటి సందు
గలుగు మలినాలు నోటికి కడుపులోకి
జారి జబ్బుల కలిగించు చేరి వైద్యు
ని గన మిగుల ధనము ఖర్చు నిజమరాశ 44
పాదరక్షలు చేతితో పట్టగూడ
దనుచు నుడువుట సత్యమే గనగ నిజము
సాగువేళననంటును రోగక్రిములు
చేతబట్టనారోగ్యపు చేటరాశ 45
చంద్ర కిరణ ప్రభావిత సంద్రమందు
నోషధీ గుణములు మెండు నుండు కార్తి
కంబునను పౌర్ణమీ తిథి కడలి స్నాన
మాచరించిన ఫలమిడు మహినరాశ 46
చర్మ రక్షణ కలిగించు చలిన చేత
నత్వమును రగిలించును సత్వమిడును
ఉదర సంబంధ వ్యాధుల వదలగొట్టు
నంబుధి స్నాన సత్ఫలితంబరాశ 47
రక్త ప్రసరణ మెరుగు పరచును మేని
కాంతి వృద్ధి బొందు మనసు శాంతినొందు
చేయు చన్నీటి స్నానంబు చేవబెంచు
కేశరక్షణ గావించు కిటుకరాశ 48
కులము మతము ప్రాంత కలతలు విడనాడి
ఒక్కచోటజేరి ఒద్దికగను
భోజనంబుసేయ భు"వనభోజన" మాయె
కలిసి బ్రతుక శుభము గలుగరాశ 49
ఉసిరి చెట్టు కింద నోగిరంబు గొనగ
మనసు తనివిచెందు వనము నడుమ
నాకులందు తినగనారోగ్యమున్ బెంచు
స్వచ్చమైన గాలివరమరాశ 50
తలన శఠగోపమును నుంచ తనువులోని
విద్యుదావేశమంతయు వెలువరించి
మది ప్రశాంతత నొందగ మహిమజూపు
లోహ స్పర్శయే కోవెలలోనరాశ 51
భక్తి తోడుత గుంజీలు పార్వతీ త
నయుని ముందు దీసెడి వేళ నరయ మేని
రక్త ప్రసరణ మెదడుకు రయముజేరి
బుద్ధి వికసించు చుండును పుడమరాశ 52
జీలకర బెల్లము వివాహ కాల మందు
వధువు వరుల శిరస్సున వరుస దాల్ప
గన పరస్పరాకర్షణ కలుగ జేయు
మెదడు చైతన్య మొందెడి విధమరాశ 53
మనసు మాటల నొకటిగా మనగ చేయు
ప్రాణ శక్తిని పంపగా బాట యగును
పాదముల స్పర్శ ప్రేమకామోదమగును
కాలు తొక్కించుడందుకే గదయరాశ 54
మల్లె పూవుల వాసన మమతబెంచు
తనువు కుదురుగా నుంచును తపన గూర్చు
వాతదోషమున్ బాపును వపువు రక్త
శుద్ధి జేయును సంతాన వృద్ధరాశ 55
గొడుగు గృహమందు తెరిచిన కుదురులేక
చుట్టుపక్కల వస్తువుల్ పట్టు డబ్బు మనుజులకు కూడగాయమై చనును గాన
తెరువబోకని దెల్పు తెరువరాశ 56
అద్దమతి ఖరీదైనది యందులోను సులభముగ లభ్యమవనిది శోభ గూర్చు
పగిలి పోయిన గ్రుచ్చును ప్రజల కనగ
పగలరాదింట నద్దమన్ పలుకరాశ 57
కటిక చీకటిన్ నఖముల కత్తిరించ
చిగురు సహితము తెగునని తగని గాయ
మగునని తలచి రవి యస్తమయము పిదప
గోళ్ళుతీయుట తగదను గుర్తరాశ 58
గతిన గ్రహణ కాల మతి నీల లోహిత కిరణములును దాకి కీడు గలుగు
నంచుగర్భిణులను కించిత్తు గదలరా
దనిరి పెద్దలెపుడు గనుమరాశ 59
ఏకవింశతి పత్రాల నేకదంతు
పూజ సల్పగ నారోగ్యపూర్ణమిడును
శ్వాస చర్మపు వ్యాధుల సంహరించు
నాకులాయుస్సునందించు ననుటరాశ 60
కారమున్ ముందు గొనుటను కారణమున
నోట లాలాజలంబుల నూట యుండు
జీర్ణ శక్తియు మెరుగగు చేరు తీపి
ముందుగా గొననజీర్ణమొందరాశ 61
తుమ్ముటన్ గననారోగ్య దోషమనుచు
కొంత తడవు నిల్చియు నీరు గొనగ నిచ్చి
దీర్ఘమాయురారోగ్యముల్ దీవెనొసగి
సాగిపోవుట నాచార స్వరమరాశ 62
వక్షమందున వేలాడి లక్షణముగ
నల్లపూసలు నిడునట చల్లదనము
నలుపు దృష్టిదోష నివారణమ్ము గాన
దాల్ప శుభమగు నరయగ ధరనరాశ 63
పంచ పల్లవములు పరిమళ ద్రవ్యాలు
నారికేళ ఫలము చేరియుండు
పసిడి రాగి నీట పావనత్వము గూర్చు
కలశ జలమన నారోగ్యకరమరాశ 64
దేవళంబు జేరి దీక్ష ప్రదక్షిణ
చేసి మూర్తి గాంచి చేతులొగ్గి
తడవు కొంత నిల్వ ధ్యానంబు చేకూరా
మానసిక ప్రశాంతి మనునరాశ 65
ఇంటిముందు వేప కంటికింపేగాదు
దట్టమైన నీడ తప్పకిడును
గాలి యాకు పుల్ల కలిగించు నారోగ్య
జీవనంబు నిడును స్థిరమరాశ 66
దేవదేవుని చరణాల దివ్య భక్తి
సలుపు సాష్టాంగ వందనము లలనలకు
పాడిగాదని నుడివె గర్భాశయమ్ము
నేలకంటగ రాదను నెపమరాశ 67
శ్వాస కోశ వ్యాధి సాగనంపు గుణము
జీర్ణశక్తి బెంచు పూర్ణ గుణము
ముసలి తనపు చాయ వెస జేరనీయని
తమలపాకు యమృత సమమరాశ 68
నవయుగాదిన పచ్చడి నరయ తీపి
పులుపు నుప్పుయు కారము మెలగు వగరు
చేదు కలయిక రోగ ననిరోధకముగ
ఆయురారోగ్యమిడు పర్వమోనరాశ 69
ఇంటికి సున్నంబిడుటయు
కంటికి నవకాంతి శాంతి కారకమగు నే
తంటలు గానని మది సుఖ
మంటగ తెలతెల్ల దనపుమహిమనరాశ 70
పొద్దు పొడవ చూపుడువేలు బొటన వేలు
నొకటి గా జేసి ముగ్గులనుంచు మగువ
జ్ఞాన ముద్రను దాల్చిన మౌని వలెను
మానసిక శాంతి బొందుట ఘనమరాశ 71
నిదురబోవు నపుడు నొదుగగ కుడివైపు
ఆమ్లమెగిసి గుండె నంటు గాన
ఎడమ వైపు దిరిగి పడుకున్న మేలగు
ననెడు సూక్తి కలను గనుమరాశ 72
మెదడు లేలేత నరముల కుదురుకొనక
చిన్న పిల్లలు తరువుల చివురులనగ
తలలపైగొట్ట తగదని ధర్మమొదవె
సతతమాచారమై భువి చనునరాశ 73
మంచి గంధము చలువను పంచుచుండు
మధుర కంఠమునొనరగా మందుయగును
గాన కలకంఠులకు నలంకారముగను
గంధమును బూయు చందమున్ గనునరాశ 74
ఆహారము గొనినంతనె
ఆ హా! నిదురావహించునట జీర్ణముకై
సాహాయము నిడ రుధిర ప్ర
వాహము యటజేర మత్తు వపునకు జేరున్
75
గోరు వెచ్చని నీటిని కోరి కోరి
వేకువన గ్రోల మలినాలు వీడి చనును
మేని యంగముల్ చైతన్య మూని నంత
నూతనోత్సాహమబ్బగా నోమరాశ 76
పాలు కాఫీలు తేనీరు పరులకిడగ
నోటితో నూది చల్లార్చ మేటి తప్పు
బొగ్గు పులుసు వాయువు చెడి పోవునట్లు
జేయు నోటి క్రిములచట చేరరాశ 77
వేసవిన్ రామనవమియే వేడుకవగ
భక్తి గుఢపాన సేవనాసక్తి బెంచు
విష్ణు కిడు వడపప్పు నైవేద్యమరయ
చల్లదనమును గలిగించు జవమరాశ 78
గాలి శీతలమొందగా కాయమందు
నూష్ణమధికము ఖర్చగు నుదయమందు
పులగ దధ్యోదనంబులు పొట్టకిడగ
రక్ష ధనుర్మాసదీక్షనలరు నరాశ 79
ముంగిటన్ రంగ వల్లులు ముదము గూర్ప
నావు పేడతో గొబ్బెమ్మ నలరజేయ
రోగ క్రిమికీటకాదుల రోయువేళ
మకర సంక్రాంతికాహ్వానమౌనరాశ 80
ఉసిరి పేదల సంజీవినోషధిగను
తులసి యౌషధ రారాజ తుల్యముగను
నిండు కార్తీక పౌర్ణమి పండుగందు
కలిపి కళ్యాణమొనరించు ఫలమరాశ 81
నతము ప్రవహించు నదులందు స్నానమాడ
ఓషధీ గుణములు మేనినుండ గలవు
తనువులో బుట్టు విద్యుత్తు తరలజేయు
నిలన కార్తీక మాసమే నిజమరాశ 82
వానకాలమజీర్ణమే వరలుచుండు
తినెడి యాహార దోషముల్ తీవ్రమగును
నాల్గునెలలేక భుక్తమున్ నమ్ముకున్న
సతతమారోగ్యమొసగు జీవితమరాశ 83
పసిడి నగలను దాల్చిన పరమ శుభము
చర్మరోగాల బాపి సత్సంతతిడును
తనువునుత్పన్న మగు వేడి తరలజేసి
చల్లదనమును కాపాడు జవమరాశ 84
నడుము లావెక్కకుండగా నణచునెపుడు
చురుకుదనమును పోషించు చొక్కముగను
నడుము వడ్డాణమున్ దాల్చ నమిత ఫలము
లోహ స్పర్ష శుభము మేని లోనరాశ 85
మేని చెమటన పగడము మేళవించి
పడతి సంతాన ప్రాప్తికై బలమునిడును
పగడమందానికే గాదు పలు విధముల
నాయురారోగ్యమిడు రత్నమేయరాశ 86
భూమిదానమీయ పూర్ణత్వ మబ్బదు
ధనమునీయ మిగుల తనివిగాదు
పసిడినీయ బూన బహుళంబు కాంక్షించు
తనివి దీర్చు నన్న దాన మొకటె 87
పులుపజీర్ణము గావించు కలిగినంత
పగటి వేళన భుజియించ పాడియగును
పెరుగు రాత్రిన తినగను పిలుచు రోగ
ములను తెలసి మసలుకొన ఫలమరాశ 88
నవరసాలను చిలికించి కవితలల్లి
కావ్యముల నల్లినారు సుకవినృపతులు
భావనామార్గ దర్శులై చేవ గలుగు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(89)
రామకథ మహా భారత రమ్యగాధ
భాగవతమును వెలయించి భక్తి నిల్పె
సంస్కృతీ సంప్రదాయాల చాటగలుగు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(90)
తాంతియా తోపె రాణా ప్రతాప సింహ
ఝాన్సి లక్ష్మి శివాజియు చాందుబీబి
కట్ట బ్రహ్మన యల్లూరి గాంధి నెహ్రు
భగతు సింగుల గన్నట్టి భరత మాత {91}
స్వార్థమింతైన యెరుగక సమరమందు
ప్రాణముల ఫణముగ నెట్టి క్షోణి గలిసి
మాతృ భూమికి స్వాతంత్ర్య ఫలములిడిన
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(92)
ఆది శంకరుల్ రామానుజాది సద్గు
రువులు రామకృష్ణులు వివేకుడు జగతిన
పర్యటించిరి బోధనల్ పరిమళించు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(93)
మత విభేదము లెరుగని మానవతను
ప్రాంతభేదము తెలియని భావుకతను
పెక్కుభాషల చవిగొన్న మక్కువ గల
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(94)
సరస సంగీత సాహిత్య సత్కళలను
చిత్రలేఖన శిల్ప వైచిత్రములను
వివిధ నాట్యపుకళలీను వేడ్కగలుగు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(95)
తోటి సోదర క్షేమమే మేటిగాగ
దేశ సంరక్షణోద్యోగ దీప్తి వెలుగ
ఎండ చలి వానకోర్చెడి మెండు ధీర
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
{96}
ప్రాణమను మాట నే తృణ ప్రాయమనుచు
జన్మ హేతువే రక్షణాచారమనుచు
సైనికుండయి సరిహద్దు పూని నిలుచు
సుతుల గన్నట్టి భారతీ శుభము జయము
(97)
మంచియు విశ్వాసముయు ప్ర
పంచము కలిగుండ గోరు మానసముండన్
యెంచియు నీ నడవడికన
పెంచుము ఆ రెంటి మిగుల మేలగు సుమ్మీ
(98)
తల్లిదండ్రుల దీవెనల్ వెల్లి విరియ
గురువు చూపిన మార్గమే గురుతు గాగ
హితుల సలహాలు వెన్నంటి హితము గూర్చ
సేయు కార్యము విజయమై చెంత నిలదె
(99)
భానుడుదయించి ఎదుగుచు భాసమొందు
మొలక పుట్టుచు చెట్టుయై ముదమునిచ్చు
రోజు రోజుకు నభివృద్ధి రూఢిగాక
జన్మమేటికి తృటిలోన చావుమేలు
(100)
మంచి శ్రోతకాగలడిల మంచివక్త
పాఠకోత్తముడే కవి పీఠమెక్కు
కొంతనేర్చిన యగునది కొండ సమము
అంకురము లేని వృక్షమున్నరయగలమె
(101)
ఓటమెరుగని గెలుపు పోరాటమందు
చిత్తశుద్ధిగ లక్ష్యమున్ చేరువరకు
అలసటెరుగని శ్రమ సేయుమహర్నిశలు
విశ్వమంతకు నినుజూపు విజయమొకటె
(102)
గతమునందున చేసిన ఘనుల పనులు
తిరిగి నీవాచరింపగ నొరుగునేమి
మూస పనులకు విలువలేముండవయ్య
కొత్తదనమును మనసార కోరు జగము
(103)
తారలంటెడి లక్ష్యమున్ చేరనెంచ
కుసుమమైనను పొందమా కువలయాన
లక్ష్యమందలి ఘనతయే సాక్ష్యమగును
ఉన్నతాలోచనలె జగతికూపిరగును
(104)
చేతకానిది లేదు నీ చేవముందు
ఓటమన్నదిలేదు పోరాటమందు
చిన్ని చేపల మొప్పకే శిరము వంచు
ప్రళయ సంద్రపు అలజడి ప్రకృతి లోన(105
స్వార్థ జీవికి గలిగెడి సౌఖ్యమేమి
బంథుమిత్రుల నొనగూరు బలమదేమి
పరులకుపకారమొనరించు ప్రతినలోన
వనధి లంఘించు శక్తియే వరముగాదె
(106)
ధనము సంపాదనముసేయ ధరణిలోన
బతుకు సాంతమునంతమై చితికిపోవు
జీవనము సఫలతమొందజేయు కార్య
మొక్కటైనను సలుపక ముక్తి లేదు (107)
భారతీయత నడుగడుగు ప్రస్తుతించి
సంస్కృతీ సంప్రదాయాలు సంస్మరించి
శాస్త్ర విజ్ఞాన ప్రాభవం సాగనెంచి
రచన సలిపితి పద్య తోరణముగాగ (108)

అద్భుతంగా ఉంది... అభినందనలు
రిప్లయితొలగించండి